English | Telugu

మరో ప్రాజెక్ట్ నుంచి హీరో రవితేజ డ్రాప్..?

మాస్ మహరాజ్ రవితేజకు టైం పెద్దగా కలిసిరావడం లేదు. కిక్ 2, బెంగాల్ టైగర్ లు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి. ఒక పక్క దిల్ రాజు తో ఎవడో ఒకడు క్యాన్సిల్ చేసుకోవడం, కొత్త డైరెక్టర్ చక్రితో సినిమా పట్టాలెక్కుతుందో లేదో తెలియని పరిస్థితి. తాజాగా మరో ప్రాజెక్ట్ నుంచి రవి డ్రాప్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. తమిళ సినిమా కణితన్ రీమేక్ కోసం నిర్మాతను సంప్రదించారు నిర్మాతలు. కానీ రెమ్యునరేషన్ దగ్గర తేడా వచ్చి, ప్రొడ్యూసర్లు వెనక్కి వెళ్లిపోయారట. దిల్ రాజు సినిమా కూడా రెమ్యునరేషన్ గురించే క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రవితేజ మార్కెట్ ప్రకారం, ఆయనకు నిర్మాతలు నాలుగు కోట్లు ఇద్దామనుకుంటున్నారట. కానీ రవి మాత్రం తన తోటి స్టార్ హీరోలతో పాటు 8 కోట్లు డిమాండ్ చేస్తున్న కారణంగానే నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలంటున్నాయి. 8 కోట్లతో రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ లాంటి యాభై కోట్ల కెపాసిటీ హీరోలతోనే చేయచ్చు కదా అనేది నిర్మాతల అభిప్రాయంగా కనిపిస్తోంది. నిర్మాతల హీరోగా పేరు పడ్డ రవితేజకు ఇప్పుడు నిర్మాతలతోనే భేదాలు రావడం విచిత్రం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.