English | Telugu

అనుష్క కు అలాంటి మగాళ్లంటే ఇష్టమట..!

అనుష్క శెట్టి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ హైదరాబాద్ గా ఎంపికైంది. ఈ న్యూస్ లో ఏమీ ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఈ భామ స్టార్ అలా ఉంది. కెరీర్లో అరుంధతి సినిమా తో పీక్స్ కు చేరుకుంది అనుష్క క్రేజ్. ఆ తర్వాత కూడా సైజ్ జీరో లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో, అభిమానగణాన్ని పెంచుకుంటూ పోతోంది. ఆమెను ఇష్టపడే వాళ్లలో ఎక్కవ శాతం మందికి నచ్చేది ఆమె సింప్లిసిటీనే. వ్యక్తిగతంగా అనుష్క చాలా సాధారణంగా ఉంటుంది. ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూడా సింపుల్ గా చీరకట్టును ధరించడానికి ఇష్టపడుతుంది.

డ్రస్సింగ్ సరే, మరి కాబోయే హబ్బీ ఎలా ఉండాలి అని అడిగితే ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చింది అనుష్క. ఆమెకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకునే అబ్బాయిలంటే అసలు ఇష్టం ఉండదట. మన నిజాయితీ కళ్లలోనే కనబడుతుంది. అబ్బాయిని చూడగానే అతని నిజాయితీ అర్ధం అవుతుంది. నేను అలాంటి వారినే ఇష్టపడతాను. నా చుట్టూ కూడా అలాంటి వాళ్లే ఉంటారు అంటూ చెబుతోంది. ఇప్పటికే ముప్పయ్యో పడిలో పడిపోయిన ఆ అమ్మడికి ఇప్పుడే పెళ్లి గురించిన ఆలోచన లేదట. ప్రస్తుతం మంచి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. ఇప్పట్లో ఆ ఆలోచన లేదు అంటూ చెబుతోంది స్వీటీ శెట్టి. ప్రస్తుతం అనుష్క చూపులన్నీ బాహుబలి 2 మీదే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో వయసైపోయిన పాత్రలో కనిపించిన అనుష్క, సెకండ్ పార్ట్ లో రాజకుమారిగా, యోధురాలిగా కనిపిస్తుందని సమాచారం. ఇప్పటికే తన పాత బరువుకు వచ్చేసిన అనుష్క, మెగాస్టార్ 150వ సినిమాలో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.