English | Telugu

మారుతికి పోయిన చోటే దొరికింది

పెద్దలు ఏ మాట చెప్పినా ఊరికే చెప్పరు. అలాంటి మంచి మాటల్లో ఒక మంచి మాట... పోయిన చోటే వెతుక్కోవాలి. మన డైరెక్టర్ మారుతి విషయంలో ఈ మాట కొంచెం మార్పుతో నిరూపణ అయింది. మారుతి ఎక్కడైతే ఏదైతే పోగొట్టుకున్నాడో అది మళ్ళీ అక్కడే దొరికింది. ఇంత తిరకాసు లేకుండా అసలు విషయానికి వస్తే, మారుతి డైరెక్టర్‌గా సక్సెస్‌లు సాధించినప్పుడు విక్టరీ వెంకటేష్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. వీళ్ళ కాంబినేషన్‌లో ‘రాధ’ అనే ప్రాజెక్టు రెడీ అయింది. అయితే ‘రాధ’ కథ నాది అంటూ ఓ రచయిత రచ్చ చేయడంతో ఆ ప్రాజెక్టు డిస్ట్రబ్ అయింది. దానికితోడు మారుతికి వరుసగా ఫ్లాపులు రావడంతో వెంకటేష్ కూడా మారుతిని కొంతకాలం రెస్టు తీసుకోమ్మా అంటూ ‘రాధ’ ప్రాజెక్టుని పక్కనే పెట్టేశాడు. అది మారుతికి పెద్ద షాక్. మారుతి పరువు అక్కడ పోయింది. అయితే ఈమధ్య మారుతి ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో హిట్ కొట్టడంతో పోయిన మారుతి పరువు మళ్ళీ వెంకటేష్ కాంపౌండ్లోనే దొరికింది. వెంకటేష్ మళ్ళీ మారుతిని పిలిచి సినిమా చేద్దామని అన్నాడు. ‘రాధ’ని పక్కన పెట్టేసి మరో కథతో ఈ సినిమా తీయబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ నవంబర్ మధ్యలోనే ప్రారంభమయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. డోన్ట్ వర్రీ.. ఈ సినిమా మారుతి చేతిలోంచి జారిపోయే అవకాశం లేదు.. ఎందుకంటే మారుతి ఇప్పుడు సక్సెస్‌లో వున్నాడు కదా...

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.