English | Telugu

మురిసిపోతున్న నాగార్జున

పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినపుడే పుట్టదు... జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు తండ్రి పొందును సుమతీ... అని సుమతీ శతకకారుడు ఏనాడో చెప్పాడు. ఇప్పుడు అక్కినేని నాగార్జున ఆ పద్యానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నాడు. నాగ్ తనయుడు అఖిల్ నటించిన ‘అఖిల్’ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. సినిమా రిజల్ట్ విషయం అలా వుంచితే, ఈ సినిమా ద్వారా అఖిల్ తెలుగు ప్రేక్షకుల నుంచి పాస్ మార్కులు పొందినందుకు నాగార్జున మురిసిపోతున్నాడు. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అఖిల్ విడుదల కాగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ‘‘ఏ నటుడికైనా డిక్షన్ చాలా అవసరమని నాన్నగారు చెప్తుండేవారు. అఖిల్ గొంతు చాలా బావుంది. డైలాగ్స్ బాగా చెప్పాడు. డాన్సులు బాగా చేశాడు. మొదటి సినిమాకే ఇలా చేస్తే పది సినిమాల తర్వాత ఇంకెంత చేస్తాడో అనిపించింది’’ అని నాగార్జున చెప్పాడు. ఈ మాటల్లోనే నాగార్జున ఏ రేంజ్ పుత్రోత్సాహంతో మురిపిసోతున్నాడో అర్థమవుతోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.‘అఖిల్’ సినిమా బాక్సాఫీసు దగ్గర కూడా సక్సెస్ అయితే నాగార్జున పుత్రోత్సాహానికి హద్దే వుండదని భావిస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.