English | Telugu

దిగులు తీరింది..పుత్రోత్సాహంలో మోహన్‌బాబు..!

తెలుగు సినీరంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మోహన్ బాబు. తనతో పాటు తన వారసుల్ని కూడా పరిశ్రమకు పరిచయం చేసి నిజమైన సినీ భక్తుడనిపించుకున్నారు. అలాంటి ఆయనకు గత కొన్ని రోజులుగా ఒక దిగులు పట్టుకుంది. ఎన్ని సినిమాలు చేసినప్పటికి విష్ణు, మనోజ్‌లకు సరైన హిట్ దొరకడం లేదు దీంతో ఆయన కొంచెం డిప్రెషన్‌లో ఉన్నారట.

లేటేస్ట్‌గా మంచు విష్ణు నటించిన ఈడోరకం..ఆడో రకం మూవీ మొన్న అభిమానుల ముందుకు వచ్చింది. ఫస్ట్ అవర్‌లోనే సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో మంచు అభిమానులు ఖుషి అయ్యారు. దీనికి ఉబ్బితబ్బైన కలెక్షన్ కింగ్ తనయుడు నటించిన సినిమాని నిన్న అభిమానులతో కలిసి థియేటర్‌లో చూడాలనుకున్నారు. అయితే తాను అనుకున్న సమయానికి టికెట్లు దొరకలేదు. దీంతో నిర్మాత అనీల్ సుంకరను అడిగి శనివారానికి టిక్కెట్లు తెప్పించుకున్నారు. పైగా ఆరోజు కూడా తాను అడిగినన్ని టికెట్లు దొరకలేదని చెప్పారు. మొత్తానికి తనకి టికెట్లు దొరకలేదన్న బాధ ఉన్నప్పటికీ తన కొడుకు సినిమా మంచి విజయం సాధించడం పట్ల మోహన్ బాబు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది. ఈ రకంగా పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు పెదరాయుడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.