English | Telugu
మంచు విష్ణు దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్? అసలు నిజం ఇదే
Updated : Jun 25, 2025
మంచు విష్ణు(Manchu Vishnu)కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'(Kannappa)ఈ నెల 27 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. శ్రీ కాళహస్తీశ్వరుడు లేడని వాదించిన 'తిన్నడు' అనే ఒక బోయవాడు, ఆ తర్వాత అతని జీవితంలో సంభవించిన సంఘటనలతో శ్రీ కాళహస్తీశ్వరుడు ఉన్నాడని గుర్తిస్తాడు. అనంతరం 'కన్నప్ప' గా మారి శత్రువుల నుంచి శ్రీ కాళహస్తీశ్వరుడ్ని ఎలా కాపాడుకున్నాడన్నదే కథాంశం. ప్రచార చిత్రాలతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో హిట్ టాక్ ని సంపాదించుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గ్గర పడే కొద్దీ కన్నప్ప ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విష్ణుతో యాంకర్ మాట్లాడుతు 'మీరు భవిష్యత్తులో దర్శకుడిగా మారతారా అని అడగడం జరిగింది. అప్పుడు విష్ణు స్పందిస్తు 'దర్శకత్వం వహిస్తే అమితాబ్(Amitabh Bachchan)సినిమాకి వర్క్ చేస్తాను. అది నా కల. భారతీయులంతా ఆయన పనిని ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు. కన్నప్ప లో 'రుద్ర' అనే క్యారక్టర్ లో పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas), మహాదేవ శాస్తి గా మోహన్ బాబు(Mohan Babu)శివుడి'గా అక్షయ్ కుమార్(Akshay Kumar)కిరాతగా మోహన్ లాల్(Mohanlal)పార్వతి దేవి గా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal)కనిపిస్తున్నారు.
మహాభారతం సీరియల్ ని తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్(Mukesh KUmar Singh)దర్శకుడిగా వ్యవహరించగా, విష్ణు, మోహన్ బాబు సుమారు 200 కోట్ల వ్యయంతో నిర్మించారు. అజనీష్ లోక్ నాద్ సంగీతాన్ని అందించాడు. సాంగ్స్ అన్నిచోట్ల మారుమోగిపోతున్నాయి.
