English | Telugu

డ్రగ్స్ వాడటంపై కోర్టులో శ్రీరామ్ సమాధానం ఏంటో తెలుసా!..మరి కుమారుడ్ని చూసుకోవాలిగా

తెలుగు, తమిళ భాషల్లో సుదీర్ఘ కాలం నుంచి పలు చిత్రాల్లో నటిస్తు వస్తున్న 'శ్రీరామ్'(Sriram)డ్రగ్స్ వాడినట్టుగా రుజువు కావడంతో రెండు రోజుల క్రితం 'చెన్న'(Chennai)లోని 'నుంగం బాక్కం' పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణ సమయంలో పోలీసులతో శ్రీరామ్(Sriram)మాట్లాడుతు నాకు మత్తు పదార్ధాలని అన్నాడిఎంకె(Aiadmk)నేత ప్రసాద్ అలవాటు చేసాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన 'తీంకిరై'అనే మూవీలో నేను చేశాను. అందుకు సంబంధించి నాకు పది లక్షలు ఇవ్వాలి. ఆ అమౌంట్ అడుగుతున్నప్పుడల్లా నాకు కొకైన్ ఇచ్చేవాడు. రెండు సార్లు వాడిన తర్వాత మూడో సారి నేనే అడిగే పరిస్థితి వచ్చిందని శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.

ఈ కేసుకి సంబంధించి పోలీసులు శ్రీరామ్ ని నిన్న కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తితో శ్రీరామ్ మాట్లాడుతు డ్రగ్స్ వాడి తప్పు చేశాను. నా కుమారుడిని చూసుకోవాల్సి ఉంది. బెయిల్ మంజూరు చెయ్యండని కోరాడు. అందుకు న్యాయమూర్తి స్పందిస్తు బెయిల్ నేను ఇవ్వలేను. నార్కోటిక్ కేసులు విచారించే ప్రత్యేక కోర్ట్ లో బెయిల్ పిటిషన్ దాఖలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తు జులై 7 వరకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు శ్రీరామ్ ని 'పుళల్' జైలుకి తరలించారు.ఈ కేసులో అన్నాడిఎంకె నేత ప్రసాద్ తో పాటు మరో ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. విచారణలో వాళ్లే శ్రీరామ్ కి డ్రగ్స్ ఇచ్చిన్నట్లు చెప్పారు.

'తీంకిరై'(Theankirai)మూవీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కగా శ్రీ రామ్ ఇందులో పోలీస్ క్యారక్టర్ ని పోషించాడు. వెట్రి, స్మృతి వెంకట్,కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రకాష్ రాఘవ దాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.