English | Telugu

మ‌హేష్ సినిమా టైటిల్..ఫ‌స్ట్ లుక్..ఎక్స్ క్లూజివ్‌

మ‌గాడు, ప‌రాక్ర‌మ‌, క‌న్న‌య్య‌.. మ‌హేష్ బాబు సినిమా కోసం పరిశీలించిన టైటిల్స్ ఇవి. అయితే ఇవేం కాద‌ని... ద‌ర్శ‌కుడు ఎప్ప‌టిక‌ప్పుడు క్లారిటీ ఇస్తూనే వ‌చ్చాడు. ఆ త‌ర‌వాత శ్రీ‌మంతుడు పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చింది. ఈ పేరు గురించి మాత్రం కొర‌టాల ఎప్పుడూ నోరు మెద‌ప‌లేదు. ఇప్పుడు ఈ టైటిల్ ఫిక్స‌యిపోయింది. మ‌హేష్ బాబు - శ్రుతిహాస‌న్ సినిమాకి శ్రీ‌మంతుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకొంది. ఈ సినిమాని మేలో విడుద‌ల చేస్తారు. ఓవ‌ర్సీస్ లో ఈ సినిమాని క్లాసిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ పంపిణీ చేస్తోంది. శ్రీ‌మంతుడు ఫ‌స్ట్ లుక్‌.. లోగో డిజైన్ ఇవే.