English | Telugu
మహేష్ శ్రీమంతుడు కాదట
Updated : Feb 4, 2015
సూపర్‌స్టార్ కొత్త సినిమా టైటిల్ చివరకు ఏమవుతుందో కాని.. రోజుకో పేరు మాత్రం షికార్లు చేస్తోంది. మహేష్`కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించి తాజాగా మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు ‘జమిందార్’ అనే పేరును చిత్ర యూనిట్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో మహేష్ పాత్ర తీరుతెన్నుల ప్రకారం ఈ పేరు కరెక్ట్ యాప్ట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్‌భావిస్తున్నట్లు సమాచారం. సహజంగా మహేష్ సినిమాలన్నింటింకి షూటింగ్ తొలి దశలోనే పేరు నిర్ణయిస్తుంటారు. అయితే కొత్త సినిమాకు మాత్రం పేరు నిర్ణయించకపోగా.. గత రెండు నెలలు గా శ్రీమంతుడు అనే పేరు చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ గా ‘జమిందార్’ అనే పేరు తెరపైకి వచ్చింది