English | Telugu
పూరికి హ్యాండిచ్చిన మహేష్??
Updated : Dec 13, 2014
వన్, ఆగడు తరవాత మహేష్‌బాబులో అతిజాగ్రత్త ఎక్కువైంది. ఏ సినిమాని ఒప్పుకోవాలన్నా ప్రిన్స్ చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా, సేప్ గేమ్ ఆడేయడం బెటర్ అనుకొంటున్నాడు. అందుకే.. ఆయన తన నిర్ణయాల్ని కూడా మార్చుకొంటున్నాడు. పూరి జగన్నాథ్ సినిమా విషయంలో కూడా ప్రిన్స్ డైలామాలో పడినట్టు తెలుస్తోంది. పూరి ఫామ్‌ని దృష్టిలో ఉంచుకొంటే.. మహేష్‌లో కంగారు మొదలైందట. వరుస ఫ్లాపులు ఇస్తున్న తరుణంలో పూరితో జత కడితే... ఏమైపోతానో అన్నభయం మొదలైంది. కథ విషయంలో పూరి సీరియస్‌గా ఉండడు.. ఈ విషయమే మహేష్‌ని ఆలోచించుకొనేలా చేస్తోంది. అందుకే పూరికి నో చెప్పాడని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. కొరటాల శివ తో సినిమా పూర్తయ్యాక పూరితో ఓ సినిమా చేయాలి. కానీ ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నట్టు తెలిసింది. మహేష్ నో అన్నందుకే... వరుణ్ తేజ్‌తో సినిమా చేయడానికి పూరి రెడీ అయిపోయాడని టాక్ వినిపిస్తోంది. టెంపర్ పూర్తవ్వగానే మహేష్ తో సినిమా చేయాల్సిన పూరి, ఇప్పుడు వరుణ్ కోసం కథ తయారు చేసుకొనే పనిలో పడ్డాడంటే మహేష్‌తో సినిమా లేనట్టే అని అర్థం చేసుకోవచ్చు. ఒక వేళ టెంపర్ గనుక సూపర్ డూపర్ హిట్ అయిపోతే... మహేష్ తన నిర్ణయం మార్చుకొంటాడేమో..??