English | Telugu
మహేష్ సినిమాకి టైటిల్ నిర్ణయించలేదు
Updated : Oct 7, 2014
సూపర్‌స్టార్ మహేష్ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 9 నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది.
టైటిల్ ఇంకా నిర్ణయించలేదు:
నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ మాట్లాడుతూ ` ‘‘మా మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో సూపర్‌స్టార్ మహేష్‌గారితో చేస్తున్న తొలి చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 9న ప్రారంభమవుతుంది. మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఇంతవరకు ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించలేదు. టైటిల్ నిర్ణయించిన తర్వాత అఫీషియల్‌గా మేమే ఎనౌన్స్ చేస్తాము. మా బేనర్‌లో తొలి చిత్రమే సూపర్‌స్టార్ మహేష్‌గారితో చెయ్యడం మా అదృష్టం. మాకు ఇచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేశాం. సూపర్‌స్టార్ మహేష్‌బాబుగారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేలా ఈ చిత్రం వుంటుంది’’ అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, సంపత్, సుబ్బరాజు, తులసి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధి, థ్రిల్స్: అనల్ అరసు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, మేకప్: పట్టాభి, కాస్ట్యూమ్స్: రాజు, స్టిల్స్: దాసు, ఛీఫ్ కో`డైరెక్టర్: పి.వి.వి.సోమరాజు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వి.వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొడక్షన్ మేనేజర్ బి.వి.రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అశోక్‌కుమార్‌రాజు ఎం., చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి, రవిశంకర్, సి.వి.మోహన్, కథ`స్క్రీన్‌ప్లే`మాటలు`దర్శకత్వం: కొరటాల శివ.