English | Telugu

SSMB29: మహేష్ చేసిన పనికి రాజమౌళి షాక్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ ఫిల్మ్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే షూటింగ్ సమయంలో మహేష్ డెడికేషన్ చూసి రాజమౌళి ఆశ్చర్యపోతున్నారట.

మెజారిటీ స్టార్ హీరోలు యాక్షన్ సీన్స్, రిస్కీ షాట్స్ కోసం డూప్ లను వాడుతుంటారు. అయితే మహేష్ మాత్రం 'SSMB29' కోసం డూప్ ని వాడకుండా స్వయంగా తానే రిస్కీ షాట్స్ చేస్తున్నారట. మహేష్ ధైర్యం, డెడికేషన్ చూసి రాజమౌళి ఫిదా అయినట్లు తెలుస్తోంది.

మామూలుగా రాజమౌళి తన సినిమాల కోసం హీరోలను తెగ కష్టపెడుతుంటారు అనే పేరుంది. హెవీ వర్కౌట్స్ చేయడం, రిస్కీ యాక్షన్ సీన్స్ చేయడం వంటివి ఉంటాయి. దీంతో సినిమా స్టార్ట్ కావడానికి ముందు ఓ షోలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మహేష్ ని ఆట పట్టించాడు. రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యాక ఉంటుంది అని అన్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు మహేష్ బాబే రివర్స్ లో రాజమౌళి సర్ ప్రైజ్ చేశాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.