English | Telugu

ఐడియా సెల్యూలర్ కి మహేష్ బాబు

ఐడియా సెల్యులర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు మహేష్ బాబు అంగీకరించారని సమాచారం. మహేష్ బాబు ఇప్పటికే ఆరు ప్రోడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. గతంలో మహేష్ బాబు యూనివర్సెల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇప్పుడు ఐడియా సెల్యులర్ కంపెనీ మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ ని చూసి మహేష్ బాబుని తమ ఐడియా సెల్యులర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారని తెలిసింది.

ఈ మధ్య మన రాష్ట్రంలో ఏ కంపెనీకి అయినా మాస్ అపీలున్న బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మహేష్ బాబు అని ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. అందుకే బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబుకి అంత డిమాండ్ ఏర్పడింది. మహేష్ బాబు ఇటీవల నటించిన "ఖలేజా" ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మహేష్ బాబుకున్న డిమాండ్ కానీ, మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ కానీ ఏ మాత్రం తగ్గకపోవటం విశేషం.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం