English | Telugu
'శ్రీమంతుడు' కాలేజీ స్టూడెంటా?
Updated : Jul 17, 2015
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకి సంబంధించిన ఓ కొత్త స్టిల్ రిలీజైంది. ఈ ఫోటోలో మహేష్ బాబు చేతిలో రెండు పుస్తకాలు పట్టుకొని, శృతితో కలిసి స్టైల్ గా నడుకుచుకుంటూ వెళుతున్నాడు. జీన్ ఫ్యాంట్, టీ షర్ట్ లో మహేష్, లాంగ్ స్కట్, టాప్ లో శృతి చాలా క్యూట్ పెయిర్ గా అలరిస్తున్నారు.
కాలేజీలో శ్రుతిహాసన్‌తో మహేష్ బాబు చేసే సందడి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. మరి మహేష్ సినిమాలో స్టూడెంట్ గా కనిపిస్తాడా? లేక కాలేజీకి వేరే పనిపైన వెళతాడా? అన్నది తెరపైనే చూడాలి. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఓ రెంజులో వున్నాయి. రేపు విడుదల కాబోయే ఆడియో కూడా హిట్టై , ట్రయిలర్ కూడా అదిరితే సినిమా హైప్ ఆకాశాన్ని తాకడం ఖాయం.