English | Telugu
ఉదయభానుకు చిరు, బాలయ్య ఝలక్!
Updated : Jul 20, 2015
ఉదయభాను యాంకరింగు మాటేమో గానీ, ఎగస్ట్రాలు మాత్రం బాగానే చేస్తుంది. వీక్షకులకు హుషారు తెప్పించాలన్న ఉద్దేశంతో కాస్త ఓవరాక్షన్ చేస్తుంటుంది. ఉదయభాను స్పీడు మాత్రం వేదికపై ఉన్నవారికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఆదివారం రాత్రి జరిగిన టీ ఎస్ ఆర్ అవార్డుల కార్యక్రమంలో ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అలవాటు ప్రకారం ఇక్కడా... తన ఓవరాక్షన్ చూపించింది.
ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొన్న అనంతరం నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ప్రామ్టింగ్ ఇవ్వడానికి ప్రయత్నించింది భాను. ముందు కాస్త లైట్‌గా తీసుకొన్నా, తరువాత మాత్రం బాలయ్య సీరియస్ అయ్యాడు. 'ఆపు.. నేను చెప్తా..' అని సీరియస్ గా ఉదయబాను వంక చూశాడు.. ఆ తరవాత తేరుకొని చిరు నవ్వు చిందించాడు. చిరంజీవి విషయంలో ఉదయభాను కాస్త అతిగా స్పందించింది. 'చిరు సార్ 150వ సినిమా ఎప్పుడు' అని సందర్భం లేకుండా చిరుని ఒకట్రెండు సార్లు అడిగింది. అందుకు చిరు కాస్త సీరియస్‌గానే 'ఆగు..' అన్నట్టు సంజ్ఞ చేశాడు. దాంతో ఉదయబాను స్పీడుకు బ్రేకులు పడ్డాయి.