English | Telugu

ఇది సినిమా షూటింగ్‌ అనుకుంటున్నారా.. విశాల్‌పై హైకోర్టు అక్షింతలు! 

తమిళ్‌ హీరోల్లో ఎక్కువ వివాదాలు ఉన్న హీరోల్లో విశాల్‌ ఒకరు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యపై పోరాటం చేయడమో, వివాదంలో ఇరుక్కోవడమో చేస్తుంటాడు. తాజాగా ఓ కేసు విషయంలో మద్రాస్‌ హైకోర్టు జడ్జితో అక్షింతలు కూడా వేయించుకున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌, విశాల్‌ మధ్య ఓ వివాదం నడుస్తున్న విషయంలో తెలిసిందే. దీనికి సంబంధించిన విచారణలో భాగంగా హైకోర్టుకు హాజరయ్యాడు విశాల్‌. తనతో తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని, లైకా ప్రొడక్షన్స్‌తో తనకు అగ్రిమెంట్‌ జరిగిందనే విషయం తెలియదని న్యాయమూర్తితో వాదించాడు. విశాల్‌ మాటలకు ఆగ్రహించిన న్యాయమూర్తి ‘ఇది షూటింగ్‌ కాదు. తెలివిగా సమాధానం చెప్పాను అనుకుంటున్నారా? సరిగ్గా చెప్పండి. లేదంటే కోర్టు ధిక్కారణ కేసు మీపై మోపాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. దీంతో కాస్త తగ్గిన విశాల్‌.. కోర్టుకు కావాల్సిన విధంగా సమాధానాలు చెప్పాడు.

లైకా సంస్థతో గత కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది. అయితే ఇది ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. ఓ పక్క సినిమాలు చేస్తూనే ఇలాంటి వివాదాల్లో కూడా తల దూర్చుతూ ఉంటాడు విశాల్‌. ఈమధ్య నడిగర్‌ సంఘంతో కూడా సత్సంబంధాలు లేవు. అయినా ఆ సంఘ సభ్యులతో కూడా ఇటీవల ఛాలెంజ్‌ చేశాడు. ఎవరు ఎన్ని చెప్పినా తాను సినిమాలు తీస్తానని, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అని ప్రకటించాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .