English | Telugu
అజయ్ మృతి.. మంచు మనోజ్ ట్వీట్ వైరల్
Updated : Aug 2, 2024
మంచు మనోజ్(manchu manoj)హీరోగా 2008 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ నేను మీకు తెలుసా(nenu meeku telusa)మంచి ప్రేక్షకాదరణతో పాటు మ్యూజికల్ హిట్ గాను నిలిచింది. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై మనోజ్ సోదరి లక్షి ప్రసన్న నే నిర్మించింది. స్నేహ ఉల్లాల్, రియా సేన్ హీరోయిన్లు కాగా నాజర్, బ్రహ్మానందం వంటి వారు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఇప్పుడు ఈ మూవీ టీం శోక సంద్రంలో మునిగిపోయింది.
నేను మీకు తెలుసా కి అజయ్ శాస్త్రి(ajay sastry)దర్శకుడిగా వ్యవహరించాడు. అంతే కాదు రచనా బాధ్యతలని కూడా అందించాడు. ఇప్పుడు ఈయన చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మనోజ్ అందరకి తెలియచేసాడు. నా ఫ్రెండ్ అజయ్ చనిపోయాడన్న వార్త తెలిసి గుండె బద్దలైపోతున్నటుగా అనిపిస్తుంది.ఈ బాధను మాటల్లో చెప్పలేను. అజయ్ మరణవార్త కల అయితే బాగుండు. ఓం శాంతి, మిస్ యూ రా అజయ్.. త్వరగా వెళ్లిపోయావ్.ఇక నువ్వు లేకపోతే నా జీవితం మునుపటిలా ఉండదు.కానీ ఒక్కటి మాత్రం నిజం నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను. లవ్యూ ఫరెవర్ అంటూ ట్వీట్ చేసాడు.
హైదరాబాద్ కి చెందిన అజయ్ called 12 అనే షార్ట్ ఫిలిం తో సినీ సర్కిల్స్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖి, డేంజర్ సినిమాలకి దర్శకత్వ శాఖలో కూడా పని చేసాడు. 1974 జులై 26 న జన్మించారు.ఇక శాస్త్రి మృతి పట్ల పలువురు చిత్ర ప్రముఖులు తమ సంతాపాన్ని కూడా తెలియచేసారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.