English | Telugu

ఇద్దరు స్టార్‌ హీరోలతో ‘లోక2’.. చిల్‌ అవుతున్న మైఖేల్‌, చార్లీ!

కళ్యాణి ప్రియదర్శన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘లోక చాప్టర్‌1: చంద్ర’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దాదాపు 300 కోట్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘లోక2’ రాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్‌. లోక1లో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చిన దుల్కర్‌ సల్మాన్‌, టొవినో థామస్‌.. పార్ట్‌2లో హీరోలుగా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. దుల్కర్‌, టొవినో ఇద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘వెన్‌ లెజెండ్స్‌ చిల్‌.. మైఖెల్‌ అండ్‌ చార్లీ..’ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

లోక2 గురించి ఇంతకుముందు వచ్చిన వార్తల్లో టొవినో మాత్రమే హీరోగా నటిస్తున్నాడని చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడది ఇద్దరు హీరోల సినిమా అని కన్‌ఫర్ట్‌ చేశారు. చాప్టర్‌ 1లో ఉన్నట్టుగానే చాప్టర్‌2లో కూడా చాలా సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. లోక సినిమాతో నిర్మాతగా కూడా తనని తాను ప్రూవ్‌ చేసుకున్నాడు దుల్కర్‌. లోక 1లో మాదిరిగానే చాప్టర్‌2లో కూడా ఎవరూ ఊహించని కాంబినేషన్‌ కనిపిస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా దుల్కర్‌.. మలయాళంలోనే కాదు, తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. కాబట్టి లోక మాదిరిగానే లోక2 కూడా భారీ విజయాన్ని అందుకుంటుందన్న కాన్ఫిడెన్స్‌ దుల్కర్‌కి ఉంది.