English | Telugu

‘ఖుషి’ పబ్లిక్‌ టాక్‌ -  ముగ్గురికీ సినిమా ప్లస్సే!

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘ఖుషి’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాపైన ఆడియన్స్‌కి ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఎందుకంటే విజయ్‌ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఈ ముగ్గురూ ఫ్లాపుల్లో ఉన్నారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్‌ అవ్వడం వారి కెరీర్‌కి ఎంతో ముఖ్యం. ఆడియన్స్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయో ఈ ముగ్గురికీ అలాగే ఉన్నాయి. ఈ సినిమా మొదటి షో పూర్తయిన తర్వాత పాజిటివ్‌ టాకే వచ్చింది. ఒక కొత్త కథను చూద్దామని థియేటర్స్‌కి వచ్చిన ఆడియన్స్‌ పాత కథనే కొత్తగా చూపించిన విధానం బాగా నచ్చింది. విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌, సమంత ఫ్యాన్స్‌ ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేసిన ఈ సినిమాలో ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. విజయ్‌, సమంతల పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఇద్దరూ అద్భుతంగా చేశారని ప్రేక్షకులు చెబుతున్నారు. రొటీన్‌ కథనే తీసుకొని అందంగా మలచిన డైరెక్టర్‌ శివను ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ముగ్గురికీ ఈ సినిమా ప్లస్‌ అవుతుందని అంటున్నారు. అక్కడక్కడా సినిమా కాస్త స్లో అయినట్టు అనిపించినా అదంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆడియన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్‌ చాలా పెద్ద ప్లస్‌ అయిందని చెప్పాలి. హేషామ్‌ అబ్ధుల్‌ వాహెబ్‌ అందించిన పాటలు సినిమా రిలీజ్‌కి ముందే పెద్ద హిట్‌ అవ్వడంతో సినిమాలో ఆ పాటలు మరింత ఆకట్టుకున్నాయంటున్నారు. కొందరు ఈ సినిమా పాటలు వినే సినిమాకి వచ్చామని చెబుతున్నారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సన్నివేశాలకు, సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా బాగా చేశారని అంటున్నారు. మ్యూజిక్‌ సినిమాని నిలబెట్టిందనేది కొందరి అభిప్రాయం. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని కొందరంటుంటే, ఫ్యామిలీ సబ్జెక్ట్‌ అయినప్పటికీ యూత్‌ కూడా ఎంజాయ్‌ చేసేలాగే ఉందని కొందరంటున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాకి పబ్లిక్‌ నుంచి పాజిటివ్‌ టాకే వచ్చింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.