English | Telugu

ఇద్దరితో కలిసి ఉన్నా, నలుగురితో రొమాన్స్, రెండు పెళ్లిళ్లు..ఇది అసలైన రికార్డు

హిందీ చిత్ర పరిశ్రమలో తమదైన శైలిలో రాణించిన నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో 'కునికా సదానంద్'(Kunickaa Sadanand)కూడా ఒకరు. 1988 లో ఖబ్రస్తాన్ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన కునికా 2018 వరకు పలు రకాల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం హిందీ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్న 'బిగ్ బాస్' 19(Big Boss 19) వ సీజన్ లో కంటెస్ట్ గా చేస్తుంది. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో తన పర్సనల్ లైఫ్ లో జరిగిన పలు విషయాల గురించి ప్రేక్షకులకి తెలియచేసింది.

ఆమె హౌస్ లో మాట్లాడుతు ప్రేమకి సంబంధించి ఫస్ట్ బ్రేక్ అప్ అయినప్పుడు ఆల్కహాల్ కి బానిస అయ్యాను. డ్రగ్స్ జోలికి వెళ్ళలేదు గాని ఆల్కహాల్ మాత్రం పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎక్కువగా తాగడంతో బరువు చాలా పెరిగిపోయాను. మందు మానేయమని మా నాన్న చెప్పినా వినలేదు. డబ్బింగ్ చెప్పడానికి స్టూడియోస్ కి వెళ్ళినప్పుడు అద్దంలో నా ముఖం చూసుకొని షాక్ అయ్యేదాన్ని. దాంతో ఇంకొంచం ఎక్కువగా ముందు తాగేదాన్ని. రిలేషన్స్ విషయానికి వస్తే ఇద్దరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాను. నలుగురితో రొమాన్స్ చేసి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. కానీ నటులతో మాత్రం ప్రేమలో పడలేదు. వాళ్ళు ఎంత సేపు అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు.ఎప్పుడు అద్దం ముందు ఉండే వాళ్ళతో నేను ఎలా ఉండగలను అని కునికా చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా కునికా చెప్పిన మాటలు వైరల్ కావడంతో, నెటిజెన్స్ ఆమె ధైర్యానికి హాట్స్ ఆఫ్ చెప్తున్నారు.

కునికా మొదట అభయ్ కొఠారి ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకుంది. వీరివురుకి ఒక బాబు ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి వినయ్ లాల్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని, అతనితో కూడా విడాకులు తీసుకుంది. వినయ్ లాల్, కునికా కి ఒక బాబు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.