English | Telugu

'టైగర్' తో కృష్ణవంశీ సినిమా?

కృష్ణవంశీ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ న‌టించ‌బోతున్నాడా? ఈ ప్రాజెక్టు త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌బోతోందా?? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. గోవిందుడు అంద‌రివాడేలే త‌ర‌వాత ఓ చిన్న సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడు కృష్ణ‌వంశీ. ఆ చిత్రానికి ప్ర‌కాష్‌రాజ్, దిల్‌రాజు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అప్ప‌ట్లో చెప్పుకొన్నారు. ఎందుక‌నో ఆ త‌ర‌వాత దాని ఊసు లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఆ ప్రాజెక్ట్ తెర‌పైకి రాబోతోంది. ఇందులో సందీప్‌కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ట‌. ఓ డిఫ‌రెంట్ ప్రెజెంటేష‌న్‌తో ఈ చిత్రం ప్ర‌యోగాత్మ‌కంగా రూపుదిద్దుకోనుంద‌ని టాక్‌. మరోవైపు సందీప్ కిష‌న్ నటించిన టైగర్ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.