English | Telugu
ఈ న్యూ కపుల్‌కి యాభైరోజులు
Updated : Jun 20, 2014
చూస్తుండగానే కొత్తజంట చిత్రం యాభై రోజులు గడిచిపోయాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు టాకు యావరేజ్ అనుకున్నారు. తీరా చూస్తే యాభై రోజుల సినిమా అయ్యింది. ఈ మధ్య కాలంలో ఓపెనింగ్స్ వస్తేనే పెద్ద విషయం. వారం రోజులు సినిమా ఆడితేనే సినిమా సక్సెస్ అని అనేసుకుంటున్నారు. అలాంటిది ఈ సినిమా యాభైరోజల మైలు చేరుకోవడం నిజంగా గొప్పసంగతి. అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించిన ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయని అల్లు అరవింద్ గతంలో చెప్పారు. ఏమైనా యాభై రోజుల సక్సెస్ అంటూ కొత్తజంట పోస్టర్ కూడా విడుదల చేశారు.