English | Telugu

'కొత్తజంట' విడిపోయిందోచ్!

అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించిన 'కొత్తజంట' మూవీ టాక్ బాగా లేకపోయిన కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయట. ముఖ్యంగా నైజాంలో కలెక్షన్లు బాగానే రాబడుతుంది కొత్తజంట. కొత్త సినిమాలు రిలీజైన వాటికి టాక్ మరీ బ్యాడ్ గా వుండడం ఈ సినిమాకి కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా తక్కువ కావడంతో ఇప్పటికే లాభల బాటలో నడుస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమా యూనిట్ కూడా చాలా హ్యాపీ వున్నారట. అయితే హీరో శిరీష్ మాత్రం సినిమా హిట్టైన చాలా అసంతృప్తిగా వున్నాడట. సినిమాలో క్రెడిట్ మొత్తం రెజీనాకే దక్కడం తన నటనపైన విమర్శలు రావడంతో మూవీ ప్రచారానికి కూడా దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాడట. డైరెక్టర్ మారుతి మాత్రం సినిమా హిట్టైన౦దుకు నవ్వలా లేక రెండో సినిమాకే అల్లు శిరీష్ పెడుతున్న టార్చర్ కి ఏడవాలో తెలియక జుట్టుపీకుంటున్నాడట!