English | Telugu

'కిష్కింధపురి' మూవీ ఫస్ట్ రివ్యూ!

కంటెంట్ బాగుంటే హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇటీవల ప్రచార చిత్రాలతో అలాంటి కంటెంట్ ఉన్న సినిమా అనే నమ్మకాన్ని కలిగించింది 'కిష్కింధపురి'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. అయితే అవుట్ పుట్ మీద నమ్మకంతో ముందుగానే ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 10 సాయంత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి, మీమర్స్ కి స్పెషల్ షో వేశారు. 'కిష్కింధపురి' చూసిన వారిలో మెజారిటీ మెంబర్స్.. సినిమా బాగుందని చెబుతుండటం విశేషం. (Kishkindhapuri)

'కిష్కింధపురి' అసలు కథలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకుందట. మొదటి 15 నిమిషాలు నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే అసలు కథ మొదలవుతుందో.. అప్పటినుంచి ఒక్కసారిగా సినిమా తీరు మారిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందోన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ.. కథనం పరుగులు పెట్టిందని అంటున్నారు. హారర్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉందట. ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సర్ ప్రైజ్ లు ఉన్నాయని చెబుతున్నారు. ప్రీ క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందట. క్లైమాక్స్ రొటీన్ గానే ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పించిందని అంటున్నారు.

హారర్ థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అనేవి చాలా కీలకం. ఆ పరంగా చూస్తే.. 'కిష్కింధపురి' సినిమాకి బీజీఎం, విజువల్స్ ప్రధాన బలంగా నిలిచాయట. నటీనటుల విషయానికొస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ తన పాత్రకు న్యాయం చేశాడని, ఇక అనుపమ పరమేశ్వరన్ అయితే తన నటనతో సర్ ప్రైజ్ చేసిందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి 'కిష్కింధపురి'కి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే.. బెల్లంకొండ ఖాతాలో హిట్ పడినట్లే అని చెప్పవచ్చు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.