English | Telugu

ఓటీటీలోకి 'కింగ్‌డమ్‌'.. రిజల్ట్ రివర్స్ అవుతుందా?

విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన రీసెంట్ మూవీ 'కింగ్‌డమ్‌'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ వి.పి ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ చిత్రం.. మంచి అంచనాలతో జూలై 31న థియేటర్లలో అడుగుపెట్టింది. కానీ, ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. (Kingdom)

'కింగ్‌డమ్‌' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతోంది 'కింగ్‌డమ్‌'. ఆగస్టు 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. మరి ఈ 'కింగ్‌డమ్‌' మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. (Kingdom On Netflix)

2018లో వచ్చిన 'టాక్సీవాలా' తర్వాత విజయ్ సక్సెస్ చూడలేదు. 'కింగ్‌డమ్‌'తో వరుసగా ఆరో పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒక దానికి రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్టర్ కాగా.. మరో దానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.