English | Telugu

ఆ ఘనత సాధించిన ఏకైక తెలుగు మూవీ కింగ్‌డమ్!

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'కింగ్‌డమ్' బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. కేరళ కలెక్షన్స్ మాత్రం అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. (Kingdom)

నిజానికి 'కింగ్‌డమ్' సినిమా మలయాళ వెర్షన్ విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ సినిమా కేరళలో 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో నాన్ మలయాళ వెర్షన్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఏకైక తెలుగు చిత్రంగా 'కింగ్‌డమ్' రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే జోరు కొనసాగితే కేరళలో 'కింగ్‌డమ్' మరిన్ని సంచలనాలు సృష్టించేలా ఉంది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ జూలై 31న థియేటర్లలో అడుగుపెట్టింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.