English | Telugu

తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. రేపటి నుంచి షూటింగ్స్ బంద్!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు వేతనాలు 30 శాతం పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. దీంతో ప్రస్తుతం చిత్రీకరణ దశలో పలు సినిమాలు, సిరీస్ ల షూటింగ్ కి బ్రేక్ పడే అవకాశముంది.

సినీ కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచాలనే నిబంధన జూన్ 30తో ముగిసింది. దీంతో 30 శాతం వేతనాలు పెంచాలని, లేదంటే ఆగస్టు 1 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే ఫెడరేషన్ ప్రకటించింది. దీనికి సంబంధించి కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది.

సోమవారం(ఆగస్టు 4) నుంచి 30 శాతం వేతనాలు పెంపుకి అంగీకరించి, కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన నిర్మాతల షూటింగ్ లకి మాత్రమే తమ సభ్యులు వెళ్తారని ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది. పెంపుకి అంగీకరించకపోతే అప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్ ల షూటింగ్ లో పాల్గొనేది లేదని స్పష్టం చేసింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పలు షూటింగ్ లకు బ్రేక్ పడే ప్రమాదముంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.