English | Telugu

డాన్స్ చేస్తు గుండెపోటుతో ప్రముఖ నటుడి మృతి..మిత్రమా మళ్ళీ జన్మిస్తావా!  

పాన్ ఇండియా స్థాయిలో 'కాంతార'(Kantara)మూవీ సాధించిన ఘన విజయం తెలిసిందే. రిషబ్ శెట్టి(Rishab Shetty)తో సహా మూవీలో నటించిన వాళ్ళందరికి ఈ చిత్రం మంచి పేరు తీసుకురావడంతో పాటు, మరిన్ని అవకాశాలు వచ్చేలా చేసింది. అలాంటి వాళ్ళల్లో రాకేష్ పూజారి(Rakesh Poojary)కూడా ఒకడు. ముఖంపై చిరునవ్వుని ప్రదర్శిస్తు రాకేష్ చేసిన పెర్ ఫార్మెన్స్ కి ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు.

రీసెంట్ గా రాకేష్ పూజారి గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఉడిపి జిలాల్లోని మియార్ అనే విలేజ్ లో ఆదివారం రాత్రి జరిగిన ఒక మెహందీ ఫంక్షన్ కి రాకేష్ హాజరయ్యాడు. అందరితో పాటు సరదాగా డాన్స్ చేస్తున్న రాకేష్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సహచరులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే రాకేష్ ప్రాణాలు కోల్పోయాడు. రాకేష్ మరణంపై రిషబ్ శెట్టి ట్వీట్ చేస్తు 'కాంతార' లోని నీ క్యారక్టర్ ని పెర్ ఫార్మ్ చేసే క్రమంలో నీ ముఖంపై చిరునవ్వు ఎప్పటికి నా మదిలో మెదులుతూనే ఉంటుంది. నీ లోటు మరొకరు తీర్చలేనిది. మిత్రమా మళ్ళీ జన్మించు అని ట్వీట్ చేసాడు. కాంతార ని నిర్మించిన హోంబులే ఫిలిమ్స్ కూడా రాకేష్ మృతికి తన సంతాపాన్ని తెలియచేసింది

రాకేష్ ఇటీవల కాంతార పార్ట్ 2 కి సంబంధించి తన క్యారక్టర్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. కన్నడతో పాటు తుళు భాషల్లోను పలు సినిమాల్లో నటించిన రాకేష్, స్టాండ్ అప్ కామెడీ ప్రోగ్రాం 'కామెడీ కీలాడిగలు' లో అద్భుతమైన కామెడి ని ప్రదర్శించి సీజన్ 4 విన్నర్ గా నిలిచాడు. చిన్న వయసు నుంచే పలు స్టేజ్ షోలు కూడా చేసిన రాకేష్ వయసు ప్రస్తుతం ముపై మూడు సంవత్సరాలు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.