English | Telugu

వ‌రుణ్‌తేజ్‌ని చంపేస్తారా?

మ‌న సినిమాలన్నీ 'శుభం' కార్డుతో ముగియాల్సిందే. హ్యాపీ ఎండింగ్ లేక‌పోతే.. అలాంటి క‌థ‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు మింగుడుప‌డ‌వు. హీరో చ‌నిపోయినా, ప్రేమ‌క‌థ సుఖాంతం కాక‌పోయినా ఆ సినిమాపై బోల్డ‌న్ని డౌట్లు వ‌స్తుంటాయ్‌. అయితే.. క్రిష్ మాత్రం ఈ సెంటిమెంట్‌కి ఎదురీదాల‌ని నిర్ణ‌యించుకొన్నట్టు టాక్‌.

ఆయ‌న ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న చిత్రం `కంచె`. మెగా హీరో వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. రెండో ప్ర‌పంచ‌యుద్ధం కాలం నాటి క‌థ ఇది. ఇందులో వ‌రుణ్ ఓ సైనికుడిగా న‌టిస్తున్నాడు. అటు దేశ‌భ‌క్తి, ఇటు ప్రేమ‌క‌థ మిళిత‌మైన ఈ సినిమా యాంటీ క్లైమాక్స్‌తో ముగుస్తుంద‌ట‌. ఇందులో క‌థానాయ‌కుడు త‌న దేశం కోసం, ప్రేమ కోసం ప్రాణ‌త్యాగం చేయ‌డతో విషాదాంతంగా ముగియ‌బోతోంద‌ని టాక్‌. ఈ త‌ర‌హా క‌థ‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా న‌చ్చ‌వు. క‌థ డిమాండ్ చేసినా స‌రే... ఆ జోలికి అస్స‌లు వెళ్ల‌రు మ‌న ద‌ర్శ‌కులు. మ‌రి కంచె విష‌యంలో ఈ సెంటిమెంట్ ఎంత బ‌లంగా ప‌నిచేస్తుందో తెలియాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.