English | Telugu

ఇద్ద‌రి పెద‌వుల్నీ పిండేసిన క‌మ‌ల్‌

క‌మ‌ల్‌హాస‌న్ సినిమా అంటే... స‌మ్‌థింగ్ స్పెష‌ల్ ఉండాల్సిందే. క‌థ‌,క‌థ‌నాల్లో త‌న‌దైన ముద్ర చూపిస్తుంటారాయ‌న‌. అయితే.. త‌న సినిమాలో శృంగారం మిక్స్ చేయ‌డంలో క‌మ‌ల్‌.. రూటే సెప‌రేటు. క‌మ‌ల్ సినిమాల్నీ ఓసారి ప‌రిశీలించండి. ఏదోలా రొమాన్స్ మిక్స్ చేస్తుంటాడు. లిప్‌లాక్‌ల‌కైతే లెక్కేలేదు.

తాజాగా... చీక‌టి రాజ్యంలోనూ త‌న విశ్వ‌రూపం చూపించేశాడ‌ని టాక్‌. ఇదో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. అస్త‌మానూ... ఫైట్లూ, ఛేజింగులే చూపిస్తే అంత కిక్ ఉండద‌ని క‌మ‌ల్ ఫీలై ఉంటాడు. అందుకే ఈ సినిమాలో లిప్‌లాక్‌ల‌కు చోటిచ్చాడ‌ట‌. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్లున్నారు. త్రిష ఓ క‌థానాయిక‌గా క‌నిపిస్తే.. మ‌ధుశాలిని మ‌రో క‌థానాయిక‌. వీరిద్ద‌రి పెద‌వుల్నీ ఓ స‌న్నివేశంలో ఎడాపెడా పిండేశాడ‌ట క‌మ‌ల్‌.

చీక‌టి రాజ్యం సినిమాలో ఈ లిప్‌లాక్ స‌న్నివేశాలు కూడా హైలెట్‌గా నిలుస్తాయ‌ని త‌మిళ చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. త్రిష చాలాకాలం త‌ర‌వాత లిప్ లాక్ సన్నివేశంలో క‌నిపించింద‌ని, క‌మ‌ల్ అనేస‌రికి మ‌ధుశాలికి లిప్‌లాక్ సీన్‌లో జీవించేసింద‌ని త‌మిళ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకొంటున్నాయి. మ‌రి వెండి తెర‌పై ఆ స‌న్నివేశాలు ఎలా పండాయో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.