English | Telugu
అమ్మో అది వాళ్ళ ఇష్టం..కాజల్
Updated : Sep 15, 2015
పెళ్లికి ముందే సహజీవనం పేరుతో కలసి జీవించడంపై ఎన్ని అభ్యంతరాలు ఎదురవుతున్నా, సంప్రదాయవాదులు ఈ సంస్ర్కృతిపై మండిపడున్నా.. యువత మాత్రం సహజీవనంపైనే మొగ్గుచూపుతుంది. జీవితాంతం కలసి ఉండాల్సినవాళ్లం ఒకరి అభిప్రాయాలు మరొకరు పెళ్లికి ముందే తెలుసుకోవాలనుకోవడంలో తప్పేంటి? అంటూ వాదిస్తున్నాయి. ఈ విషయంపై కాజల్ కూడా స్పందించింది. సహజీవనంపై మీ కామెంట్ ఏంటి? అని అడిగితే ''ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లది. కలసి జీవించాల్సిన ఇద్దరు వ్యక్తులు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఏది తప్పో ఏది ఒప్పో వాళ్లే నిర్ణయించుకోవాల్సిందే వాళ్లే. నేను మాత్రం ప్రస్తుతానికి అమ్మానాన్నలతో కలసి ఉంటున్నా. సజజీవనం అనే ప్రసక్తే లేదు'' అంది.