English | Telugu
దేవికి మొత్తం తెలుసంటున్న జ్యోతిలక్ష్మి
Updated : Jun 5, 2015
తన అప్ అండ్ డౌన్స్ అన్నీ దేవిశ్రీప్రసాద్ కి తెలుసంటోంది బొద్దుగుమ్మ ఛార్మి. అప్ అండ్ డౌన్స్ అంటే ఏవేవో ఊహించేసుకోకండి...ఛార్మి జీవితంలో అప్ అండ్ డౌన్ అట. ఈ జ్యోతిలక్ష్మి ఎంత బిజీగా ఉన్నా దేవీ మాట మరిచిపోవడం లేదు. కల్లోకూడా కలవరిస్తూనే ఉందా అన్నట్టు తయారైంది. ఎవరకీ తెలియని విషయాలు కొత్తగా చెబుతున్నట్టు తెగ హొయలుపోయింది. దేవిశ్రీప్రసాద్ తనకు చాలా సన్నిహుతుడంది. తెలుసులేమ్మా కొత్తగా ఏమైనా చెప్పు అంటే....దేవీ చాలా మంచిమనిషి, తన జీవితంలో అప్ అండ్ డౌన్స్ కు సంబంధించిన అన్ని విషయాలు తనకు తెలుసు...తాను డౌన్ లో ఉన్నప్పుడు అన్నివిధాలుగా సపోర్ట్ చేశాడని ఆకాశానికెత్తేసింది. దేవీతో స్నేహం జీవితాంతం గుర్తుండిపోతుందంటోంది. కేవలం ఆయన మాత్రమే కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ తనతో చాలా సన్నిహితంగా ఉంటుందని సంబరపడుతూ చెబుతోంది. ఏదేమైనా దేవీశ్రీ ప్రసాద్ కి తాను స్పెషల్ అని మరోసారి కన్ ఫార్మ్ చేసింది ఛార్మి! అదీ సంగతి.