English | Telugu

జూనియర్ ఎన్టీఆర్‌కు పోలీసులు ఫైన్..!

నిబంధనల విషయంలో పక్కగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ పోలీసులు విధి నిర్వహణలో సామాన్యులైనా..సెలబ్రెటిలైనా ఎవరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా ప్రముఖ సినీ హిరో జూనియర్ ఎన్టీఆర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతోంది. దీనిలో పాల్గొనేందుకు నిన్న ఎన్టీఆర్ తన కారులో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు కారును ఆపారు.

ఎన్టీఆర్ డ్రైవర్ అన్ని ధ్రువపత్రాలను చూపించాడు. అయితే నిబంధనలకు విరుద్థంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.700చలనా విధించారు. అయితే కారులో ఎన్టీఆర్ ఉన్నారని ఆయన్ని దించి వచ్చి చెల్లిస్తానని డ్రైవర్ చెప్పగా, అలా కుదరదని చలానా చెల్లించిన తర్వాతే వెళ్లాలని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని డ్రైవర్ చలానా చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తాము ఎవ్వరికి పక్షపాతం చూపించబోమని విధి నిర్వహణే తమకు ముఖ్యమని పోలీసులు మరోసారి నిరూపించుకున్నారు. ఫైన్ కట్టి ఎన్టీఆర్ కూడా తను సాధారణ పౌరుడినే అని రుజువు చేశాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.