English | Telugu

20 ఏళ్లకే ఇండస్ట్రీ హిట్.. చిరు, బాలయ్య రికార్డులు ఫట్!

20 ఏళ్ళ వయసులో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికే ఆలోచిస్తుంటారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 20 ఏళ్లకే ఎన్నో సంచనాలు సృష్టించి స్టార్ హీరోగా ఎదిగాడు. 19 ఏళ్లకే 'ఆది' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. 20 ఏళ్లకే 'సింహాద్రి'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇది దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన రెండో సినిమా కావడం విశేషం.

తారక్ హీరోగా నటించిన రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1'తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు రాజమౌళి. అయినప్పటికీ దర్శకుడిగా ఆయనకు రెండో అవకాశం రాలేదు. అనుకోకుండా 'సింహాద్రి' రూపంలో రెండో సినిమాని కూడా ఎన్టీఆర్ తోనే చేసే ఛాన్స్ దక్కించుకున్న రాజమౌళి.. తన దర్శకత్వ ప్రతిభ ఏంటో చూపించాడు.

జులై 9, 2003 న విడుదలైన 'సింహాద్రి' చిత్రం.. అప్పటిదాకా టాలీవుడ్ లో ఉన్న రికార్డులను తిరగరాసింది. ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సన్నివేశాలు, మాస్ డ్యాన్స్ స్టెప్పులు.. ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి వచ్చేలా చేశాయి. ఈ చిత్రం 55 సెంటర్స్ లో 175 రోజులు ఆడి, ఎప్పటికీ చెక్కుచెదరని రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు, ఆ తర్వాత పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. వాటిలో చాలా సినిమాలు సింహాద్రి కలెక్షన్స్ దాటాయి కానీ, 175 రోజుల రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయాయి. సినిమా విడుదలై 22 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆ రికార్డు అలాగే ఉంది. ప్రస్తుతం ఎంతటి హిట్ సినిమాలైనా 50 రోజులు నడిచే పరిస్థితి కూడా లేదు. దీన్ని బట్టి చూస్తే ఏ సినిమాకి దక్కని విధంగా అత్యధిక కేంద్రాలలో 175 రోజుల ఆడిన చిత్రంగా సింహాద్రి పేరు శాశ్వతంగా నిలిచిపోనుంది.

సింహాద్రి విజయానికి ఎన్నో కారణాలు కారణాలున్నాయి. కీరవాణి సంగీతం కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఆయన కంపోజ్ చేసిన అన్ని సాంగ్స్ ఆకట్టుకున్నాయి. 'చీమ చీమ', 'ఆంధ్ర సోడా బుడ్డి' సాంగ్స్ అయితే మాస్ ని ఉర్రుతలూగించాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా మాస్ ని మెప్పించాయి. రాజమౌళి సినిమాలలో హీరోలు పట్టుకునే ఆయుధాలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఇప్పటిదాకా రాజమౌళి సినిమాలలో సింహాద్రి గొడ్డలిని మించిన ఆయుధం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ గొడ్డలి పట్టుకొని ఎన్టీఆర్ శత్రువులపై విరుచుకుపడుతుంటే మాస్ ఊగిపోయారు. 20 ఏళ్ళ కుర్రాడు యంగ్ టైగర్ లా వెండితెరపై రౌద్ర రసం పండిస్తే అందరూ ఫిదా అయ్యారు. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ ఇలా ఒకటేమిటి? అన్ని కరెక్ట్ గా కుదిరాయి కాబట్టే 'సింహాద్రి' అంతటి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి అంతకుమించిన విజయాలను అందుకున్నారు. అలాగే వీళ్ళ కాంబినేషన్ లోనే 'యమదొంగ', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు వచ్చాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా వీళ్లిద్దరి కెరీర్ లో 'సింహాద్రి'కి ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది.

ముఖ్యంగా ఎన్టీఆర్ కి, ఆయన ఫ్యాన్స్ కి 'సింహాద్రి' అనేది వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఎందుకంటే ఏకంగా బాలకృష్ణ,చిరంజీవిల స్టార్డంని సవాల్ చేసేలా అప్పట్లో సింహాద్రి చరిత్ర సృష్టించింది. అప్పటికే బాలకృష్ణ,చిరంజీవి తెలుగునాట తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా వారి సినిమాలు వంద రోజులు ఆడేవి. అంతటి స్టార్డం ఉన్న హీరోల రికార్డులను కేవలం 20 ఏళ్ళ వయసున్న ఎన్టీఆర్ కొట్టాడు. ఈ జనరేషన్ లో వాళ్ళ రికార్డులను కొట్టిన మొదటి హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. ఆరోజుల్లో సింహాద్రితో ఎన్టీఆర్ సృష్టించిన సంచలనానికి ఉదాహరణగా చెప్పుకుంటే.. బాలయ్య నరసింహనాయుడు చిత్రం 105 సెంటర్స్ లో వంద రోజులు ఆడగా.. చిరు ఇంద్ర మూవీ 122 సెంటర్స్ లో ఆడింది. అలాంటిది సింహాద్రి సినిమా ఏకంగా 150 సెంటర్లలో వంద రోజులు ఆడి చరిత్ర సృష్టించింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.