English | Telugu
‘జైలర్’ పబ్లిక్ టాక్.. పాపం ఫ్యాన్స్...!
Updated : Aug 10, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి బ్లాక్ బస్టర్ బొమ్మ వచ్చి చాన్నాళ్ళైంది. తాజా చిత్రం 'జైలర్'తో ఆ లోటు తీరుతుందేమోనని చాలా మంది భావించారు. "కావాలయ్యా" సాంగ్ తో వచ్చిన హైప్ కాస్త.. ట్రైలర్ తో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. అలా.. 'జైలర్'పై అంచనాలు రిలీజ్ టైమ్ కి ఆకాశాన్ని అంటాయి.
ఇక గురువారం (ఆగస్టు 10) జనం ముందు నిలిచిన 'జైలర్'కి మొదటి ఆట నుంచే మంచి టాక్ వచ్చేసింది. మరీముఖ్యంగా.. ఫస్టాఫ్ అద్భుతంగా ఉందనే మాట వినిపిస్తోంది. అయితే, సెకండాఫ్ మాత్రం ఆ స్థాయిలో లేదంటున్నారు. రజినీకాంత్ మార్క్ మేనరిజమ్స్, స్టైల్స్ కి ఢోకా లేదంటున్నారు. దర్శకుడు నెల్సన్ శైలి కామెడీ, రజినీ స్టైలిష్ యాక్షన్, అనిరుధ్ నేపథ్య సంగీతం చాలా బాగా వర్కవుట్ అయ్యాయని చెప్పుకుంటున్నారు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ కి అయితే గూస్ బంప్స్ రావడం పక్కా అట. తమన్నా "కావాలయ్యా" పాట మాత్రం తెరపై ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. అతిథి పాత్రల్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అదరహో అనిపించారట. ఓవరాల్ గా.. రజినీ ఫ్యాన్స్ కి పూనకాలే అన్నది 'జైలర్' పబ్లిక్ టాక్.