English | Telugu
మహేష్‌కి ఐరెన్ లెగ్ తగిలాడేంటి??
Updated : Jan 9, 2015
పాపం మహేష్ బాబు.. అసలే రెండు ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. దానికి తోడు ఐరెన్‌లెగ్ తగిలాడు. ఆ ఐరెన్ లెగ్ ఎవరనుకొంటున్నారా..?? ఇంకెవరు.. జగపతిబాబు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకొన్న జగపతిబాబు కెరీర్ ఖతం అనుకొన్న దశలో విలన్‌గా మారాడు. లెజెండ్ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించాడు. దాంతో గురుడు లైన్లోకి వచ్చాడనుకొన్నారంతా. ఆ తరువాత విలన్‌గా వరుసపెట్టి సినిమాలు చేశాడు. రారా కృష్ణయ్య, పిల్లా నువ్వు లేని జీవితం, కరెంటు తీగ... ఇలా జోరు చూపించాడు. అయితే లాభమేముంది?? రారా కృష్ణయ్య ఫ్లాప్ అయ్యింది. పిల్లా నువ్వు లేని జీవితం, కరెంటు తీగ ఓ మాదిరి సినిమాలుగా మిగిలిపోయాయి. ఈ రెండు సినిమాల్లోనూ జగపతి చేసిందేం లేదు. ఆఖరికి లింగ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో జగపతి ఐరెన్ లెగ్గా..?? అనే సందేహం మొదలైపోయింది. ఇప్పుడు మహేష్ - కొరటాల శివ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెరపై వీళ్లిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపిస్తారట. తండ్రీ కొడుకులుగా వీళ్లిద్దరూ సెట్ అవుతారా, లేదా? అన్న అనుమానం మహేష్ అభిమానుల్ని తెగ పీకేస్తోంది. దానికి తోడు జగపతి చేసిన సినిమాలేవీ హిట్లు అవ్వడం లేదు. సో.. మహేష్ ఫ్యాన్స్ కి కొత్త భయం పట్టుకొందిప్పుడు. చివరికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో, ఏంటో..?