English | Telugu
నేను జూదగాడ్ని... అయితే ఏంటి?
Updated : Aug 5, 2015
సినిమాల్లోలానే బయట కూడా జగపతిబాబు మోస్ట్ రొమాంటిక్ పర్సన్. జగపతిపై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. సౌందర్య నుంచి ప్రియమణి వరకూ చాలామంది కథానాయికలతో జగపతిబాబుకు లింకులు వేస్తూ... కథనాలు వచ్చేవి. ఎప్పుడూ ఏ వార్తన్నీ సీరియస్ గా తీసుకోలేదు జగపతి. తండ్రి సంపాదించిన ఆస్తిని హారతి కర్పూరంలా ఖర్చు పెట్టాడని, కాసినోవాలో కోట్లు తగలబెట్టాడని జగపతిపై గాసిప్పులు వచ్చాయి. వీటిపై జగపతి మరోసారి స్పందించాడు.
''కాసినోవా ఆడిన మాట వాస్తవమే. అవును. నేను జూదం ఆడా. అయితే ఏంటి? అయితే అందులో కోట్లు పోగొట్టుకోలేదు. మహా అయితే పాతిక లక్షలు పోయుంటాయి. వంద సినిమాలు చేసి, ఇన్ని కోట్లు సంపాదించా. నా వినోదం కోసం ఆమాత్రం ఖర్చు పెట్టడం తప్పా.'' అంటున్నాడు.
చాలామంది నిర్మాతలకు ఎదురుడబ్బులిచ్చాడని చెబుతున్నాడు జగపతి. సాయం చేయడంలో ముందుంటానని, అలానే చాలా డబ్బు తగలబెట్టానని ఒప్పుకొన్నాడు జగపతి. ఆఖరికి సొంత ఇల్లు కూడా అమ్మేసి. అద్దె ఇంట్లో సెటిలయ్యాడు. లెజెండ్‌తో రూటు మార్చి ఎప్పుడైతే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా షిఫ్ట్ అయ్యాడో అప్పటి నుంచి కాస్త సెటిల్ అయ్యాడు. భారీ పారితోషికం అందుకొని అప్పుల ఊబి నుంచి తప్పించుకొని నాలుగు డబ్బులు వెనకేశాడు. ఇప్పుడైనా - ఆర్థికంగా కాస్త కంట్రోల్‌లో ఉంటాడో లేదో చూడాలి.