English | Telugu
ఆస్తుల కోసం గొడవపడుతున్న 'బ్రదర్స్'
Updated : Aug 5, 2015
ఆ సంస్థ నుంచి సినిమా వస్తోందంటే.... అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్లు. కుటుంబ కథా చిత్రాలకు ఆ సినిమాలు రాజముద్రలు. `పెద్దాయన` కొత్తవారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. చిన్న, పెద్ద తేడాలేకుండా బోల్డన్ని సినిమాలు తీశారు. పెద్దాయన పోయారు. వాళ్ల వారసులు మిగిలారు. ఇప్పుడు వారిద్దరి మధ్య ఆస్తి గొడవలు షురూ అయ్యాయని ఫిల్మ్‌నగర్ టాక్.
స్టూడియో, నిర్మాణ సంస్థ, విశాఖపట్నం, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆస్తుల పంపకంలో బ్రదర్స్ తర్జనభర్జనలు పడుతున్నారట. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ ముక్కలు అవ్వడం ఖాయమని, ఆ సంస్థ నుంచి తమ్ముడు బయటక వచ్చేసి - కొత్త నిర్మాణ సంస్థను స్థాపించడానికి రెడీ అయ్యాడని టాక్. అన్నయ్య కూడా తక్కువ తినలేదు. బాగా డబ్బులొచ్చే ప్రోపర్టీ తన పేరుమీదే ఉంచుకొని, అంతగా గిట్టుబాటుకానివన్నీ... తమ్ముడుకు పంచేస్తున్నాడట.
పెద్దాయన రాసిన వీలునామా కూడా ఇలానే ఉండడంతో... తమ్ముడు చాలా ఫీలైపోతున్నాడని, కలసి ఉండడం కష్టం - నా వాటా నేను తీసుకొని వేరు కుంపటి పెట్టుకొంటానని అన్నయ్యకు తెగేసి చెప్పాడట. ఇంటి పెద్దదిక్కు దూరమైతే.. కుటుంబం ఎలావిచ్ఛిన్నం అవుతుందో చెప్పడానికి ఈ ఇల్లే ఉదాహరణ అని.. ఫిల్మ్‌నగర్‌లో పెద్దలు మాట్లాడుకొంటున్నారు. ఇంతకీ ఆ బ్రదర్స్ ఎవరో, మీరు గెస్ చేసినట్టేనా??