English | Telugu
ఈ హీరోయిన్స్ తో ముద్దు సీన్లు చెయ్యాలంటే మందు తాగడమే
Updated : Sep 11, 2025
హిందీ చిత్రాలని ఫాలో అయ్యే భారతీయ సినీ ప్రేమికులకి 'జాకీ ష్రాఫ్'(Jackie Shroff)గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. నాలుగు దశాబ్దాలకి పై నుంచి హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తెలుగులో కూడా పంజా, సాహో,శక్తి వంటి చిత్రాల్లో విభిన్న షేడ్స్ ఉన్న క్యారక్టర్ లలో కనిపించి మెప్పించాడు. క్యారక్టర్ ఏదైనా సరే, సదరు క్యారక్టర్ కి ఒక ప్రత్యేకమైన స్టైల్ తీసుకురావడం జాకీ ష్రాఫ్ స్పెషాలిటీ.
రీసెంట్ గా 'జాకీష్రాఫ్' తాను హీరోగా రాణిస్తున్న టైంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆయన మాట్లాడుతు 'మాధురి దీక్షిత్(Madhuri Dixit),జుహీచావ్లా'(Juhi Chawla)వంటి సీనియర్ హీరోయిన్లతో ముద్దు సన్నివేశాల్లో,రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా టెన్షన్ వేసేది. దీంతో దైర్యం కోసం బ్రాందీ తాగి కెమెరా ముందు నిలబడే వాడ్ని. సదరు సన్నివేశాలు చాలా సార్లు సిగ్గుపడేలా చేసేవి. ఫ్యాన్స్ నన్ను 'సెక్సి ష్రఫ్' అని పిలిచినా, ఇంటిమేట్ సీన్స్ చెయ్యడానికి చాలా కష్టంగా ఉండేది. నిజానికి మాధురి, జుహీతో పాటు డింపుల్ కపాడియా వంటి వారిపై చిన్నపాటి అభిమానం ఉండేది. కానీ ఆ అభిమానం ఎప్పుడు హద్దులు దాటలేదని చెప్పుకొచ్చాడు.
1983 లో 'హీరో' సినిమాతో సోలో హీరోగా తన సత్తా చాటిన జాకీ ష్రఫ్, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. యాంగ్రీ యంగమాన్ అనే బిరుదుని సైతం పొందాడు. ఇప్పటి వరకు మొత్తం పదుమూడు భాషల్లో కలిపి సుమారు 250 కి పైగా చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా హౌస్ ఫుల్ 5 , తన్వి ది గ్రేట్ వంటి చిత్రాల్లో కనిపించగా, త్వరలో వెల్ కమ్ టూ జంగిల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన తనయుడు 'టైగర్ ష్రఫ్'(Tiger shroff)హీరోగా తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.