English | Telugu

ఇట్స్ మై లవ్ స్టోరీ స్టార్ లాంచ్

"ఇట్స్ మై లవ్ స్టోరీ" స్టార్ లాంచ్ ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళితే షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై, అరవింద్ కృష్ణను హీరోగా, నిఖితను హీరోయిన్ గా పరిచయం చేస్తూ, గతంలో "స్నేహగీతం" చిత్రానికి దర్శకత్వం వహించిన మధుర ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత మధుర శ్రీధర్ దర్శకత్వంలో, నూతన నిర్మాత ఎమ్.వి.కె.రెడ్డి నిర్మిస్తున్న విభిన్నప్రేమ కథా చిత్రం "ఇట్స్ మై లవ్ స్టోరీ". ఈ చిత్రమలోని హీరో, హీరోయిన్ ల పాత్రల ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచీ కోసం దాదాపు మూడున్నర వేలమంది పోటీపడ్డారు. ఆ మూడువేల అయిదు వందల మంది నుంచీ అరవింద్ కృష్ణ అనే అబ్బాయిని హీరోగా, నిఖిత అనే అమ్మాయిని హీరోయిన్ గా ఎన్నిక చేశారు దర్శకులు మధుర శ్రీధర్.


ఈ హీరో, హీరోయిన్లను మీడియాకు పరిచయం చేయటానికి ఏప్రెల్ 6 వ తేదీన తాజ్ డక్కన్ హోటల్లో "ఇట్స్ మై లవ్ స్టోరీ" స్టార్ లాంచ్ ని అత్యంత ఘనంగా ఏర్పాటుచేశారు మధుర శ్రీధర్. ఈ "ఇట్స్ మై లవ్ స్టోరీ" స్టార్ లాంచ్ కి ముందుగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులనలరించాయి. తన తొలి చిత్రం "స్నేహగీతం" చిత్రానికి సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ "ఇట్స్ మై లవ్ స్టోరీ" చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. ఈ"ఇట్స్ మై లవ్ స్టోరీ" స్టార్ లాంచ్ లో ఇంకా దినేష్, హరిష్ ‍, యామిని, రాకేష్, సారిక, అశోక్, చరణ్, సంధ్యా భవానీ, రాజేష్, ఐ మ్యాక్స్ వెంకట్, మేఘనా శృతి, వీరభద్రం, మాధురి.జె. తదితరులంతా కూడా ఈ చిత్రం ద్వారా తొలిసారిగా పరిచయమవుతున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.