English | Telugu

నితిన్ "ఇష్క్"గోవాలో షూటింగ్

నితిన్ "ఇష్క్"గోవాలో షూటింగ్. శ్రేష్ఠ మీడియా పతాకంపై, నితిన్ హీరోగా, "ఇష్క్" అనే చిత్రం 2010 డిసెంబర్ 16 వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ "ఇష్క్" చిత్రం నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. గోవాలోకల 470 సంవత్సరాల అతి పురాతనమైన మెజెస్టిక్ చర్చిలో ఈ చిత్రం షుటింగ్ ప్రారంభించబడింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో,విక్రమ్ గౌడ్ ఈ"ఇష్క్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నితిన్ "ఇష్క్"చిత్రం ముహూర్తం షాట్ కు నటుడు, నిర్మాత, దర్శకుడు జె.డి.చక్రవర్తి గౌరవదర్శకత్వం వహించారు.ఈ "ఇష్క్"చిత్రానికి అరవింద్ శంకర్ సంగీతాన్ని అందిస్తూండగా, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీని, శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ ని నిర్వహిస్తున్నారు.ఈ "ఇష్క్" చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్ గా నటించేది ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం