English | Telugu
నిఖిల్ పెళ్లి త్వరలో?
Updated : Dec 27, 2014
టాలీవుడ్లో ఇంకా పెళ్లి కాని హీరోలు చాలామందే ఉన్నారు. వరుణ్ సందేశ్, మంచు మనోజ్, రామ్, నితిన్, అల్లరి నరేష్, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ, రానా, ప్రభాస్ అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్లల్లో ఒకడైన నిఖిల్ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. స్వామిరారా, కార్తికేయ సినిమాలతో క్రేజీ హీరోగా మారిన ఈ కుర్రోడు ఈ ఇయర్ ఎండింగ్ ఓ గుడ్ న్యూస్ ను మీతో షేర్ చేసుకుబోతున్నానని సోషల్ సైట్లో ట్వీట్ చేశాడు. దీంతో అందరూ ఇక నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నిఖిల్ పెళ్లి వార్తలపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఈమధ్యే ఆది వివాహం కూడా అయిపోయింది. ఇప్పుడు నిఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడన్నమాట.