English | Telugu

గోపాల గోపాల రిలీజ్ డౌటేనా..!!

గోపాల గోపాల రిలీజ్ విష‌యంలో ఇంకా సందిగ్థ‌త వీడలేదు. ఈ సినిమా సంక్రాంతికి వ‌స్తుందా, రాదా? అనే అనుమానాలు ఇంకా అభిమానులలో మెదులుతున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ - వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న చిత్రం గోపాల గోపాల‌. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన ఓమైగాడ్ చిత్రానికి ఇది రీమేక్‌. డాలీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌ని ముందు నుంచీ చెప్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కాస్త వర్క్ బకాయి వుందని తెలుస్తోంది. ఇప్పుడు సంక్రాంతికి ఐ సినిమా విడుదలవుతోంది. దానికి పోటీగా గోపాల గోపాల విడుదల చేయడమా? మానడమా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. విడుదల చేయకుంటే రెండు సమస్యలు. ఒకటి వెనకడుగు వేసారంటారు..రెండవది మంచి సీజన్ మిస్ అవుతారు. అందుకే సురేష్ ఏ నిర్ణయం తీసుకుంటారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.