English | Telugu

ఓజీ, కాంతార సినిమాలకు పోటీగా ధనుష్ 'ఇడ్లీ కొట్టు'..!

‘కుబేర’తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ త్వరలో 'ఇడ్లీ కొట్టు' సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరోగా, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో ఒకేసారి అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.

రఘువరన్ బి.టెక్, సార్, కుబేర వంటి సినిమాలతో తెలుగులో తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు ధనుష్. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఇడ్లీ కొట్టు' తెలుగు రైట్స్ ని.. ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రైస్ కి శ్రీ వేదక్షర మూవీస్ దక్కించుకుంది. శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 'ఇడ్లీ కొట్టు' సినిమాని ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత రామారావు చింతపల్లి తెలిపారు.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ 'ఓజీ', అక్టోబర్ 2న రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' విడుదలవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాల నడుమ విడుదలవుతున్న 'ఇడ్లీ కొట్టు' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.