English | Telugu

హృతిక్ తో మళ్లీ కలిసేది లేదంటున్న మాజీ..!

హృతిక్ రోషన్, సుజానే ఖాన్ పెయిర్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా పేరు సంపాదించుకున్నారు. కానీ ఈ బంధం 2014లో విచ్ఛిన్నమైంది. ఇద్దరు పిల్లలున్న ఈ పెర్ఫెక్ట్ పెయిర్ మళ్లీ కలవాలని బాలీవుడ్ లో చాలా మంది కోరుకున్నారు. రీసెంట్ గా కంగనా ఇష్యూలో హృతిక్ కు సుజానే సపోర్ట్ ఇవ్వడంతో, ఇద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. ఈ విషయం సుజాన్ వరకూ వెళ్లింది. దాంతో పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. తాను, హృతిక్ మళ్లీ కలిసే అవకాశం లేదంటూ కుండ బద్ధలుగొట్టేసింది.

మేమిద్దరం మళ్లీ భార్యాభర్తలుగా ఉండటం కల్లే. కానీ మేం ఎప్పుడూ మంచి తల్లిదండ్రులుగా మాత్రం తప్పనిసరిగా ఉంటాం అంటూ తన ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చేసింది సుజానే. తమ బిడ్డ హ్రిదాన్ పుట్టిన రోజున ఇద్దరూ కలిసి పిల్లలతో లంచ్ చేసి ఎంజాయ్ చేశారు. ఆ కారణంగానే వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా సుజాన్ ఈ రూమర్స్ ను క్లియర్ చేసేయడంతో, హృతిక్ అభిమానులతో పాటు, బాలీవుడ్ కు కూడా క్లారిటీ వచ్చేసింది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.