English | Telugu

రేయ్‌.. బూతులు ఎక్కువ‌య్యాయ్

వైవిఎస్ చౌద‌రి సినిమాల్లో మ‌సాలా స‌న్నివేశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. లాహిరి లాహిరి, సీతారామ‌రాజు ఫ్యామిలీ డ్రామ‌లు కాబ‌ట్టి.. కాస్త‌ డీసెంట్ గా ఉంటాయి. అదే . సీతయ్య‌, ఒక్క మ‌గాడులాంటి సినిమాలు తీసుకోండి.. అతి ప‌రాకాష్ట‌కు చేరింది. దేవ‌దాస్‌లోనూ అంతే. హీరోయిజం పేరుతో ఓవ‌ర్‌డోస్ డైలాగులు వినిపించారు. ఇప్పుడు రేయ్ కూడా అంతేన‌ట‌. సాయిధ‌ర‌మ్ తేజ్ తో ఈ సినిమాలో ఊర మాస్ డైలాగులు చెప్పించిన‌ట్టు తెలుస్తోంది. దానికి తోడు స‌యామీఖేర్‌, శ్ర‌ద్దాదాస్.. మ‌రీ రెచ్చిపోయార‌ట‌. ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డి ఎక్స్‌పోజింగులూ గ‌ట్రా చేసేశార‌ట‌. ఈ సినిమాలో ఓ లిప్‌లాక్ స‌న్నివేశం కూడా ఉంద‌.ఇ తెలుస్తోంది. హీరోయిన్లు ఇద్ద‌రూ చిట్టి పొట్టి డ్ర‌స్సులేసుకొని వ‌య్యారాలు కురిపించార‌ట‌. అవి మ‌రీ కుర‌చ‌గా మారిపోవ‌డంతో... బ్ల‌ర్ చేయ‌క త‌ప్ప‌లేద‌ట‌. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, శ్ర‌ద్దాదాస్ కాన్వ‌ర్‌జేష‌న్‌లో చాలామ‌ట్టుకు బూతులు ధ్వ‌నించాయ‌ట‌. దాంతో సెన్సార్ వాళ్లు బీప్‌లు ఇచ్చేశారు. రేయ్ మొత్తం బీప్‌లూ, బ్ల‌ర్‌ల‌తో నిండిపోయిందని సెన్సార్‌వాళ్ల టాక్‌. మ‌రి సినిమాలో ఇంకెంత మిగిలిందో..??