English | Telugu

వీళ్లు చాలా హాట్ గురూ..!

యాంకర్స్ గా ఎంటరై, సిల్వర్ స్క్రీన్ మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ కొంత మంది మాత్రమే గ్లామరస్ గా నిలదొక్కుకోగలిగారు. ప్రస్తుతం ఉన్న యాంకర్లలో, గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందని ఎదురుచూస్తున్నారు ముగ్గురు భామలు. ఎవరికీ ఎవరూ తీసిపోరు. అందంలో, అభినయంలో ముగ్గురూ సూపరే.

యాంకర్ గా తెలుగు టీవీలను ఒక ఊపు ఊపిన ఉదయభాను, తన తోటి వాళ్లందరూ ఆంటీలైపోయినా, ఇప్పటికీ గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. లేటు వయసులో ఘాటు అందాలు ఆరబోస్తూ ఐటెం సాంగ్స్ చేస్తూ, కుర్రకారుకి మతి పోగొడుతోంది. హీరోయిన్ గానో, స్పెషల్ సాంగ్స్ లోనే తప్ప మామూలు క్యారెక్టర్లు మాత్రం ఈ యాంకరమ్మ చేయదు. అయినా గానీ, అవకాశాలు రావడం విశేషం. లీడర్లో, జులాయి లో ఐటెం సాంగ్స్ తో దుమ్మురేపింది..

జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన వాళ్లలో ఫస్ట్ నేమ్ అనసూయదే ఉంటుంది. యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న జబర్దస్గ్ షోకి, తన అందంతో గ్లామర్ ను తీసుకొచ్చింది అనసూయ. పెళ్లై పిల్లలున్నా, ఇంకా సూపర్ ఫిగర్ ను మెయింటెయిన్ చేస్తూ, సినిమాల్లో అవకాశాలు కొడుతోంది. నాగార్జున సరసన సోగ్గాడేలో గ్లామర్ తో మెరిసి, ప్రస్తుతం ' క్షణం ' లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఐటెం సాంగ్స్ కు నో చెబుతున్న అనసూయ మనసంతా హీరోయిన్ పాత్ర మీదే ఉన్నట్టుంది.

జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మరో సందరి రేష్మి. అనసూయ వెళ్లిపోయిన తర్వాత ఆ ప్లేస్ లోకి వచ్చి బాగానే సెటిలయ్యింది. మొదట్లో టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసినా గుర్తింపు రాని రేష్మి ఫేట్ ని జబర్దస్త్ మార్చేసింది. గుంటూర్ టాకీస్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో చీరకట్టులో తన అందాల్ని ఆరబోసి, యూత్ కు మతులు పోగొడుతోంది.

స్మాల్ స్క్రీన్ టు సిల్వర్ స్క్రీన్ హీటెక్కించేస్తున్న ఈ ముగ్గురిలో హాట్ ఎవరు..? డిసిషన్ మీదే మరి..

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .