English | Telugu

‘హోరా హోరీ’ ఆడియో రిలీజ్ డేట్

అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత’వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్. ‘చిత్రం, ‘నువ్వు నేను’, జయం’ అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘హోరా హోరీ’. నూతన,నటీ నటులతో ప్రేమ కధా చిత్రాలను రూపొందించి, విజయం వైపు అవి ప్రయాణించేలా చేయటం దర్శకుడు ‘తేజ’ స్టయిల్. ఈ చిత్రాన్నికూడా ఆయన నూతన నటీ నటులతోనే తెరకెక్కించారు.

ప్రేమ కథాచిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జూలై 29న హైదరాబాద్ లోని సైబర్ కెన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.

కొత్త నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్: పాటలు: పెద్దాడ మూర్తి: రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్; ఎడిటర్: జునైద్; కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ; స్టంట్స్: పాంథర్ నాగరాజు: నృత్యాలు: శంకర్, కెవిన్; సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి ; నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్; కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.