English | Telugu
'ఆగడు'లో హైడోస్ ఎంటర్‌టైన్‌మెంట్
Updated : Aug 28, 2014
శ్రీనువైట్ల సినిమాలో కామెడీ గురించి సపరేటుగా చెప్పనక్కరలేదు. తాను తీసిన ప్రతి సినిమా ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉండేలా జాగ్రత్తపడతాడు శ్రీనువైట్ల. ఇప్పుడు ఆగడు మూవీలో దూకుడులా కామెడీ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడట. ఇంకా చెప్పాలంటే దూకుడిని మించేలా హై డోస్ ఆఫ్ కామెడీ పెట్టాడట. ఈ సినిమాలో బ్రహ్మానందంకి తోడు పోసాని కూడా చెలరేగిపోయాడని టాక్. యాక్షన్ సీన్స్, లవ్ సీన్స్‌లో కూడా కామెడీ ఉంటుందని, సినిమాలో డల్ మూమెంట్ అంటూ ఉండదని యూనిట్ రిపోర్ట్. సో మొత్తానికి ప్రేక్షకులను మరోసారి కడుపుబ్బ నవ్వించడానికి రెడీ అవ్వబోతుంది ఆగడు సినిమా. ఈ ప్రాజెక్ట్ ఎన్ని సంచలాను సృష్టిస్తుందో ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.