English | Telugu
'హాయ్ నాన్న'కు షాకింగ్ ఓపెనింగ్స్.. ఇలా అయితే కష్టమే!
Updated : Dec 8, 2023
తెలుగులో జానర్ తో సంబంధం లేకుండా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాబట్టగల యంగ్ స్టార్స్ లో నేచురల్ స్టార్ నాని ఒకడు. తాజాగా ఆయన 'హాయ్ నాన్న' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఇది పూర్తి క్లాస్ సినిమా కావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.
మొదటి రోజు నైజాంలో రూ.1.64 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.24 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.1.03 కోట్ల షేర్ రాబట్టిన 'హాయ్ నాన్న'.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.2.91 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు సుమారుగా మూడున్నర కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటే.. మూడు కోట్ల లోపు షేర్ కే పరిమితం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.55 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.2.05 కోట్ల షేర్ కలిపి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.5.51 కోట్ల షేర్ రాబట్టింది.
వరల్డ్ వైడ్ గా రూ.27.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన హాయ్ నాన్న మూవీ.. మొదటి రోజు దాదాపు 20 శాతం రికవర్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.22 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, కుటుంబ ప్రేక్షకుల ఆదరణకు నోచుకునే అవకాశం ఉండటంతో శని, ఆది వారాల్లో పుంజుకుంటుందేమో చూడాలి.
నాని గత చిత్రం 'దసరా' పూర్తిస్థాయి మాస్ సినిమా కావడంతో మొదటి రోజు ఏకంగా రూ.21 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించింది. ఇప్పుడు క్లాస్ ఫిల్మ్ 'హాయ్ నాన్న' అందులో 25 శాతం వసూళ్ళే రాబట్టగలిగింది. 'దసరా'కు ముందు వచ్చిన 'అంటే సుందరానికీ' చిత్రానికి కూడా 'హాయ్ నాన్న'తో పోలిస్తే మొదటి రోజు కాస్త ఎక్కువ కలెక్షన్లు(రూ.5.82 కోట్ల షేర్) వచ్చాయి.
